ఆరున్నరేళ్లలో బ్యాంకుల రికవరీ 7.34 లక్షల కోట్లు

ఆరున్నరేళ్లలో బ్యాంకుల రికవరీ 7.34 లక్షల కోట్లు
  • పార్లమెంట్​లో భగవత్​ కారద్​​ వెల్లడి

న్యూఢిల్లీ: కిందటి ఆరు సంవత్సరాలు, ఈ ఫైనాన్షియల్​ మొదటి ఆరు నెలల్లో కలిపి మొత్తం రూ. 7.34 లక్షల కోట్ల ఎన్​పీఏలను బ్యాంకులు రికవరీ చేశాయని​ రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్​ కారద్​ వెల్లడించారు. ఇందులో ఫ్రాడ్​ కేసులకు సంబంధించినవీ ఉన్నాయని చెప్పారు. ఫ్రాడ్​ కేసుల నుంచి రూ. 55,895 కోట్ల రికవరీ జరిగిందని పేర్కొన్నారు.  మోసాలపై ఆర్​బీఐ  2016లో బ్యాంకులకు కొత్త గైడ్​లైన్స్​ను జారీ చేసిందని, బ్యాంకులలో మోసాలను అరికట్టేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం కూడా తీసుకుందని మంత్రి చెప్పారు. ఈ చర్యల వల్లే బ్యాంకులలో మోసాలు తగ్గుముఖం పట్టాయని చెబుతూ, 2015–16లో రూ. 68,962 కోట్ల విలువైన బ్యాంకు ఫ్రాడ్స్​ నమోదవగా, 2020–21 నాటికి అవి రూ. 11,583 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. 2021 – 22 ఫైనాన్షియల్​ ఇయర్​(ఏప్రిల్ ​– డిసెంబర్)లో బ్యాంక్​ ఫ్రాడ్స్​ రూ. 648 కోట్లేనని చెప్పారు.

ఏబీజీ షిప్​యార్డ్​ ఇన్వెస్టిగేషన్​కు రాష్ట్రాలు సహకరించట్లే..

ఏబీజీ షిప్​యార్డు కేసులో సీబీఐ దర్యాప్తుకు మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడంలేదని, అందుకే ఆలస్యమవుతోందని ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ పార్లమెంట్​కు చెప్పారు.  ఫ్రాడ్​ను గుర్తించిన తర్వాత చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం చేయడం లేదని ఆమె వెల్లడించారు.