ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టును నిర్మల్ కు తరలించేందుకు కుట్ర

ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టును నిర్మల్ కు తరలించేందుకు కుట్ర

ఆదిలాబాద్ జిల్లా: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంత్రి కేటీఆర్ కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు తో పాటు ఫ్యామిలీ కోర్టును నిర్మల్ కు తరలించేందుకు ఇంద్రకరణ్ రెడ్డి కుట్ర చేస్తున్నారని వారు ఆరోపించారు. మంత్రి ఇంద్రకరణ్ వైఖరికి నిరసనగా జిల్లాలోని న్యాయవాదులు ఇవాళ, రేపు విధులను బహిష్కరించారు. 

అంతకుముందు ఆదిలాబాద్ లో ఏర్పాటైన ‘BDNT’ ఐటీ కంపెనీని మంత్రి కేటీఆర్ సందర్శించారు. కంపెనీ ఆధునీకరణకు నిధులు ఇస్తామన్న ఆయన.. ఆదిలాబాద్ లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి 120మందికి ఉపాధి కల్పించడం సంతోషకరమన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ కోసం 5 ఎకరాల భూమి, రూ. కోటిన్నర నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో టాలెంట్ ను గుర్తించి అవకాశాలు కల్పిస్తామని స్పష్టంచేశారు.

సీసీఐ ఫ్యాక్టరీని రీఓపెన్  చేయడానికి చాలా ప్రయత్నాలు చేశామన్న మంత్రి కేటీఆర్... అన్ని రకాలుగా సహకరిస్తామని కేంద్ర సర్కారుకు ఇప్పటికే చెప్పామన్నారు. ప్రైవేటు సిమెంటు కంపెనీలు లాభాల్లో నడిచినపుడు.. అన్ని సౌకర్యాలు ఉన్న సీసీఐను ఎందుకు తిరిగి ప్రారంభించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్నవారు ముందుకొస్తే... ఆదిలాబాద్ లో ఐటీని మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆదిలాబాద్ ఆహ్లాదకరమైన ప్రాంతమన్న మంత్రి... టూరిజంను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.