లేగ దూడకు బారసాల 

లేగ దూడకు బారసాల 

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన బైరవేణి సత్యనారాయణ ఇంట్లో లేగ దూడకు సోమవారం బారసాల చేశారు.  సత్యనారాయణ పెంచుకుంటున్న ఓ ఆవు 21 రోజుల కింద లేగ దూడకు జన్మనిచ్చింది. దానికి మహాలక్ష్మి రేణుక అని పేరు పెట్టారు. బారసాలకు గ్రామస్థులు హాజరై ఆసక్తిగా తిలకించారు.