ఎంపీగా బర్రెలక్క పోటీ..ఎక్కడి నుంచి అంటే?

ఎంపీగా బర్రెలక్క పోటీ..ఎక్కడి నుంచి అంటే?

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సంచలనం సృష్టించిన నిరుద్యోగి బర్రెలక్క అలియాస్ శిరీష ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.   తాను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో   ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు . నాగర్ కర్నూలు నుంచి ఎంపీతో పాటు ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతానని చెప్పారు.  గెలిచే వరకు పోటీ చేస్తూనే ఉంటానని తెలిపారు.  నిరుద్యోగుల కోసం గళం ఎత్తుతానని చెప్పారు.  ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏదైనా చేయగలరని ప్రపంచానికి చాటి చెబుతానన్నారు. 

నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయాలంటేనే  నాయకులు  భయపడేలా చేస్తానన్నారు బర్రెలక్క.   ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీగా ఆశతో పోటీ చేస్తున్న ఒక నిరుద్యోగి అసెంబ్లీలో గానీ, పార్లమెంటులో గానీ  అడుగుపెట్టాలన్నారు.  డబ్బు ఇచ్చే వారికి కాకుండా మంచి చేసే వాళ్లకు ఓటు వేయాలని కోరారు. మీ పిల్లల భవిష్యత్తును ఆలోచించి మీ అమూల్యమైన హస్తాలతో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.  ఒక్కసారి తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని చెప్పారు బర్రెలక్క.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి ఇండిపెండెంట్ గా  బరిలోకి దిగిన బర్రెలక్కకు 5,754 ఓట్లు  సంగతి తెలిసిందే.