
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma)పై రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు బర్రెలక్క (శిరీష). ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు బర్రెలక్క. ప్రస్తుతం ఈ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. రామ్ గోపాల్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. సినిమా విడుదలను జనవరి 11వరకు సస్పెండ్ చేసింది కోర్టు.
ఇటీవల జరిగిన వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ఊరు పేరు లేని బర్రెలక్క ఫేమస్ అయ్యింది. బర్రెలక్క బర్రెలు కాస్తుంది. బర్రెలు ఆమె మాటలు వింటాయి. అందుకే ఆమెను బర్రెలక్క అంటారు.. అంటూ తనదైన స్టైల్లో సెటైరికల్ కామెంట్ చేశారు వర్మ. ఆ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న బర్రెలక్క.. వర్మపై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మరి ఈ పిర్యాదుపై తెలంగాణ మహిళా కమిషన్ ఎలా స్పందించనుందో చూడాలి.