
హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బార్లు, వైన్ షాపులకు తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. డిసెంబర్ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్థరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. డిసెంబర్ 31న వైన్ షాపులు సైతం అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంటాయని చెప్పింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అయితే కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు సూచించారు.
మరిన్ని వార్తల కోసం..