విద్యార్థినికి అసభ్య మెసేజ్‌లు.. బాసర ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ రవిపై వేటు

విద్యార్థినికి అసభ్య మెసేజ్‌లు.. బాసర ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ రవిపై వేటు

నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ వారాల రవిని విధుల నుండి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారు వైస్ ఛాన్సలర్ డా.అశోక్ కుమార్.  విద్యార్థినిపై లైంగిక వేధింపుల విషయంలో విచారణ కమిటీ అందించిన నివేదికతో ప్రొఫెసర్ రవిపై చర్యలు తీసుకున్నారు.

నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీ కాలేజీలో విద్యార్థిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపుల విషయం శనివారం బయటకొచ్చింది. PUC – 2 చదువుతున్న మైనర్ విద్యార్థిని సప్లిమెంటరీ పరీక్షల కోసం క్యాంపస్ కు వచ్చింది. ఇంటికి వెళ్తున్న టైమ్ లో ఔట్ పాస్ కోసం తన ఫోన్ ను వార్డన్ కు ఇచ్చి మాట్లాడాలని కోరింది. ఆ సమయంలో విద్యార్థిని మాటలు సందేహాస్పదంగా అనిపించడంతో… ఆమె ఫోన్ ను చెక్ చేశారు వార్డెన్. అందులో ప్రొఫెసర్ రవి వారాల నుంచి వచ్చిన మెసేజ్ లను వార్డన గుర్తించి వివరాలు తెల్సుకున్నారు. అందులో నిజామాబాద్ లోని తన ఇంటికి రావాలని… మార్కులు ఎక్కువ వేయిస్తా అంటూ ప్రొఫెసర్ పంపిన మెసేజ్ లను వార్డన్ గుర్తించారు. విద్యార్థినిని క్యాంపస్ లోనే ఉంచి… విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఐతే… ఈ విషయాన్ని మొదట అధికారులు సీక్రెట్ గా ఉంచారు. సీక్రెట్ గా దర్యాప్తు జరిపారు. విద్యార్థిని వాయిస్, ఆమె తల్లిదండ్రుల వాయిస్ రికార్డ్ చేసి వైస్ చాన్స్ లర్ కు రిపోర్ట్ పంపించారు. మైనర్ విద్యార్థికి అసభ్యంగా మెసేజ్ లు పంపిన విషయంలో ప్రొఫెసర్ రవిపై వేటు వేస్తూ వీసీ నిర్ణయం తీసుకున్నారు.