బాసర , వెలుగు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ హుండీలను మంగళవారం అధికారులు లెక్కించారు. నగదుగా రూ.43,16,703, మిశ్రమ బంగారం 60. 900 గ్రాములు, మిశ్రమ వెండి 1 .550 కిలోలు, విదేశీ కరెన్సీ నోట్లు 10 వచ్చినట్లు ఆలయ ఇన్ చార్జ్ ఈవో అంజనీ దేవి తెలిపారు. 35 రోజుల తర్వాత హుండీలు లెక్కించినట్టు చెప్పారు. ఆలయ ఏఈఓ సుదర్శన్ గౌడ్, సూపరింటెండెండ్ శివరాజ్, సిబ్బంది పోలీస్ లు, బాసర ఎస్ బీఐ బ్యాంక్ మేనేజర్ అశోక్, సిబ్బంది, వాగ్దేవి సొసైటీ సభ్యులు, చేర్యాల స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
