
బాసర ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం(జూన్ 09) మంచిరోజు కావడంతో చిన్నారులకు అక్షరభ్యాసం చేయించడానికి భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యుకట్టారు. అక్షరభ్యాసం చేయించడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది.
సౌకర్యాల్లేవ్..
మరోవైపు బాసరకు వేలాది మంది రావడంతో ..భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూలైన్ లో నిలబడిన భక్తులు కనీస వసతులు లేక చాలా అవస్థలు ఎదర్కొన్నారు. ఉక్కపోతతో భక్తులు ఎక్కువ సమయం నిలబడ లేకపోయారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు దేవాలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైల్ లో నిలబడిన చిన్నారులు సొమ్మసిల్లి పడపోతున్నారని వాపోతున్నారు. వీఐపీ దర్శనాలు చేసుకునే భక్తులకు మాత్రమే ఆలయ అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారని.. ఉచిత దర్శనానికి వెళ్లే వారికి ఎలాంటి వసతులు కల్పించడం లేదని మండిపడుతున్నారు.