రిలీజ్‌‌కు బ్రీత్ రెడీ

రిలీజ్‌‌కు బ్రీత్  రెడీ

ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ..  బసవతారక రామ క్రియేషన్స్‌‌ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసి, తన కొడుకు చైతన్యకృష్ణని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ట్యాగ్ లైన్. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకుడు. డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్  సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌తో సినిమాపై  క్యూరియాసిటీని పెంచింది. చైతన్యకృష్ణ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌‌తో ఆకట్టుకున్నాడు.

 వైదిక సెంజలియా హీరోయిన్‌‌.  వెన్నెల కిషోర్, భద్రమ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.