రియల్ ఇన్సిడెంట్స్తో.. డాక్టర్ కీర్తి : ఎంబీబీఎస్ ఎంఎస్

రియల్ ఇన్సిడెంట్స్తో.. డాక్టర్ కీర్తి : ఎంబీబీఎస్ ఎంఎస్

మలయాళ  హీరోయిన్ భావన  లీడ్ రోల్‌‌‌‌లో నటించిన మలయాళ చిత్రం ‘హంట్’ను  తెలుగులో  ‘డాక్టర్ కీర్తి : ఎంబీబీఎస్ ఎంఎస్’  అనే పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు.  షాజీ కైలాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ  కలకత్తాలో జరిగిన డాక్టర్  రేప్ మర్డర్ 
నేపథ్యంగా తెరకెక్కించారు. మలయాళంలో ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోగా,  స్వర్ణ క్రియేషన్స్, పీవీఆర్ సినిమాతో కలిసి 
మే 8న తెలుగు రాష్ట్రాల్లో విడుదల  చేస్తున్నారు. 

ఈ సందర్భంగా   నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం విశ్వనాథ్ రెడ్డి  తెలుగు టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ  కార్యక్రమానికి హాజరైన నటి  కవిత మాట్లాడుతూ ‘మహిళలకు రక్షణ లేని ఈ సమాజంలో వెస్ట్ బెంగాల్‌‌‌‌లో ఒక డ్యూటీ డాక్టర్  ఎదుర్కొన్న విషాదకర ఘటన మనందరినీ కలిచివేసింది. ఆ వైద్యురాలి ఆత్మ తన బాధను చెబితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో దర్శకుడు తెరకెక్కించారు.  తెలుగులోనూ ఈ సినిమాకు మంచి విజయం అందించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ఈ చిత్రంలోని ఎమోషన్ అందర్నీ కట్టిపడేస్తుందని నిర్మాతలు అన్నారు.