మార్కెట్లోకి వచ్చిన ఎఫికాన్ ​పురుగుల మందు

మార్కెట్లోకి  వచ్చిన ఎఫికాన్ ​పురుగుల మందు

హైదరాబాద్​, వెలుగు: పత్తి, మిరప, టమాటా, వంకాయ, దోసకాయ పంటల్లో పేనుబంక, తెల్లదోమ వంటి తెగుళ్లను నాశనం చేసే క్రిమిసంహారక మందు ఎఫికాన్​ను మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు బీఏఎస్​ఎఫ్​ప్రకటించింది. హైదరాబాద్​లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ బిజినెస్​  డైరెక్టర్​గిరిధర్​ మాట్లాడుతూ ఎఫికాన్​280 మిల్లీలీటర్ల ధర రూ.1,830 అని, ఇది ఒక ఎకరా పిచికారీ చేయడానికి సరిపోతుందని తెలిపారు.

 ఎఫికాన్​ వాడడం వల్ల పంట దిగుబడి 30 శాతం పెరుగుతుందని చెప్పారు. వరిలో తెగుళ్లను సంహరించే పురుగుల మందును వచ్చే ఏడాది తీసుకొస్తామని అన్నారు. తాము మొత్తం 35 రకాల పురుగుల మందులను అమ్ముతున్నామని గిరిధర్​ వివరించారు.