- బాస్కిన్ రాబిన్స్ ఐస్‌క్రీమ్ పిజ్జ
- మరో 16 కొత్త ప్రొడక్ట్‌లు అందుబాటులోకి
హైదరాబాద్, వెలుగు : ఐస్ క్రీమ్స్ అమ్మే బాస్కిన్ రాబిన్స్ కొత్తగా 17 ప్రొడక్ట్‌లను లాంచ్ చేసింది. ఐస్‌క్రీమ్ ఫ్లేవర్స్‌తో పాటు కొత్త రకం ఐస్ క్రీమ్‌లను కూడా తీసుకొచ్చింది. పిజ్జ మాదిరి ఉండేలా ఐస్ క్రీమ్ పిజ్జను, చాక్లెట్ లేయర్‌తో ఉండే ఐస్ క్రీమ్ బాల్స్‌ను ఐస్ క్రీమ్ రాక్స్ పేరుతో తెచ్చింది. వీటితో పాటు ఐస్ క్రీమ్ ఫ్లోట్స్, ఫ్రూట్ క్రీమ్ సండేస్ తీసుకొచ్చింది. ప్రస్తుత సమ్మర్ సీజన్‌లో ఐస్ క్రీమ్స్‌కు డిమాండ్ కనిపిస్తోందని ఈ సందర్భంగా ఇండియాలో బాస్కిన్ రాబిన్స్ స్టోర్లను నిర్వహిస్తున్న గ్రావిస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ మోహిత్ ఖట్టర్ అన్నారు.
జూన్ తర్వాత డిమాండ్ కరోనా ముందు స్థాయిలను దాటిందో లేదో చెప్పగలమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మొత్తం 37 బాస్కిన్ రాబిన్స్ స్టోర్లు ఉన్నాయి. తెలంగాణలోని మిగిలిన సిటీలలో మరో 20 స్టోర్లు ఉన్నాయని మోహిత్ అన్నారు. టైర్ 2, 3 సిటీలలో కూడా విస్తరిస్తామని చెప్పారు. రూ. 69 నుంచే ఐస్ క్రీమ్ ప్రొడక్ట్‌లను అమ్ముతున్నామని వివరించారు. ‘హైదరాబాద్‌లో వెనీలా, కాటన్ క్యాండీ వంటి ఫ్లేవర్లతో పాటు మిసిసిపీ మడ్, బెల్జియన్ బ్లిస్ వంటి ఫ్లేవర్లు పాపులర్ అయ్యాయి. బాస్కిన్ రాబిన్స్ స్టోర్లలో సండేస్, ఐస్ క్రీమ్ కేక్స్‌కు కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది’ అని వెల్లడించారు.
