న్యూఢిల్లీ : బీఏటీ పీఎల్సీ మంగళవారం ఐటీసీ లిమిటెడ్‌లో 3.5 శాతం వరకు వాటాలను బ్లాక్ ట్రేడ్ ద్వారా సంస్థాగత పెట్టుబడిదారులకు విక్రయించాలని యోచిస్తోంది. బీఏటీ తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ టీఎంఐ.. ఐటీసీలోని 43,68,51,457 షేర్లను యాక్సిలరేటెడ్ బుక్‌బిల్డ్ ప్రాసెస్ (బ్లాక్) ద్వారా సంస్థాగత పెట్టుబడిదారులకు విక్రయించాలని భావిస్తోంది.
మంగళవారం నాటి ముగింపు ధర రూ. 404.25 ఆధారంగా, బీఏటీ ద్వారా విక్రయించడానికి ఉంచిన మొత్తం ఐటీసీ షేర్ల విలువ దాదాపు 17,659.72 కోట్ల రూపాయలు.
