
హైదరాబాద్/ జీడిమెట్ల/మాదాపూర్/గండిపేట వెలుగు: గ్రేటర్ సిటీలో బతుకమ్మ వేడుకలు సంబురంగా కొనసాగుతున్నాయి. డీజీపీ ఆఫీసులో గురువారం మహిళా పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది బతుకమ్మ, దాండియా ఆడారు. డీజీపీ అంజనీకుమార్, అడిషనల్ డీజీలు సౌమ్య మిశ్రా, అభిలాష్, సంజయ్ కుమార్ జైన్ సహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది బతుకమ్మను పేర్చి కోలాటం ఆడారు.
విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ నితికా పంత్, ఇన్ స్పెక్టర్లు పాల్గొన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో మెప్మా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా సూరారం కట్టమైసమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.