
న్యూఢిల్లీ: ఊపిరితిత్తుల్లో అధిక రక్తపోటుకు చికిత్స అందించే జెనరిక్ డ్రగ్ను అమెరికాలో 180 రోజుల ఎక్స్‌క్లూజివిటీతో ప్రారంభించినట్లు హైదరాబాద్‌కు చెందిన నాట్కో ఫార్మా బుధవారం తెలిపింది. కంపెనీ ట్రాక్లియర్ ట్యాబ్లెట్ల జెనరిక్ వెర్షన్ అయిన బోసెంటన్ ట్యాబ్లెట్స్ను ప్రారంభించింది. దీనికి 180 రోజుల జెనరిక్ డ్రగ్ ఎక్స్‌క్లూజివిటీ లభిస్తుంది. ఈ సమయంలో వేరే ఏ కంపెనీ కూడా అదే ఫార్ములాతో డ్రగ్ను తయారు చేయదు. మూడేళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్‌కు బోసెంటన్ను వాడుతారు.