15 టీఎంసీలకు చేరుకున్న మిడ్‌‌‌‌ మానేరు ... మత్తడి పోస్తున్న అప్పర్‌‌‌‌ మానేరు

15 టీఎంసీలకు చేరుకున్న మిడ్‌‌‌‌ మానేరు ... మత్తడి పోస్తున్న అప్పర్‌‌‌‌ మానేరు

రాజన్నసిరిసిల్ల, వెలుగు : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో బోయిన్‌‌‌‌పల్లి మండలం మన్వాడ వద్ద గల మిడ్‌‌‌‌ మానేరు జలకళను సంతరించుకుంది. ఎస్సారెస్పీ నుంచి 13,802 క్యూసెక్కులు, గాయత్రి పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ నుంచి 3,150 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వస్తోంది. మిడ్‌‌‌‌ మానేరు పూర్తిస్థాటి నీటి నిల్వ సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 14.89 టీఎంసీల నీరు చేరింది.

 మిడ్‌‌‌‌ మానేరు నుంచి అన్నపూర్ణ ప్రాజెక్ట్‌‌‌‌కు 3,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో వైపు కూడెల్లి వాగు, పాల్వంచ వాగుల నుంచి వస్తున్న వరదతో అప్పర్‌‌‌‌ మానేరు డ్యాం డ్యాం అలుగుపోస్తుంది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌‌‌‌ సందీప్‌‌‌‌కుమార్‌‌‌‌ ఝా, ఎస్పీ మహేశ్ బి. గీతే బుధవారం ప్రత్యేక పూజలు చేసి ప్రాజెక్ట్ కుడి కాల్వకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్‌‌‌‌కు ఎగువ నుంచి 9,500 క్యూసెక్కుల నీరు వస్తోంది.