
హైదరాబాద్, వెలుగు: భారతీయ డిజైన్, క్రాఫ్ట్కు ప్రధాన వేదిక డిజైన్ డెమోక్రసీ ఫెస్టివల్ వచ్చే నెల 5–7 తేదీల మధ్య హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. మూడు రోజుల ఈ కార్యక్రమంలో 120కి పైగా ప్రముఖ బ్రాండ్లు, 80 మందికి పైగా స్పీకర్లు పాల్గొంటారు. సుమారు 15 వేల మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా. ఈ ఫెస్టివల్ భారతదేశ డిజైన్ భవిష్యత్తుపై దృష్టి పెడుతుంది. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్, ప్రొడక్ట్ డిజైన్, ఆర్ట్ నిపుణులను ఒకే చోటికి చేరుస్తుంది.
ఈ ఈవెంట్లో ఫర్నిచర్, లైటింగ్, హోమ్ ఫర్నిషింగ్స్, ఫైన్ ఆర్ట్ వంటివి ప్రదర్శిస్తారు. హైదరాబాద్‌లో బుధవారం డిజైన్ డెమోక్రసీ కో-ఫౌండర్ శైలజ పట్వారి మీడియాతో మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న ఆర్థిక, నిర్మాణ వృద్ధి ఈ డిజైన్ ఫోరమ్‌కు అనువైనదని అన్నారు. ఇందులో జైపూర్ రగ్స్, ది చార్‌కోల్ ప్రాజెక్ట్ వంటి ప్రముఖ బ్రాండ్లు పాల్గొంటున్నాయని వివరించారు.