ఇండియా సిమెంట్స్‌‌‌‌లో అమ్మకానికి అల్ట్రాటెక్ వాటా

ఇండియా సిమెంట్స్‌‌‌‌లో అమ్మకానికి అల్ట్రాటెక్ వాటా
  • ఓపెన్ మార్కెట్‌‌‌‌లో 6.49 శాతం వాటాను విక్రయించనున్న కంపెనీ

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌‌‌‌కు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్‌‌‌‌, ఇండియా సిమెంట్స్‌‌‌‌‌‌‌‌లోని 6.49శాతం వాటాను ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించనుంది. డీల్ విలువను బయటపెట్టలేదు. కిందటేడాది జులైలో ఇండియా సిమెంట్స్‌‌‌‌లో మెజార్టీ వాటాను కంపెనీ కొనుగోలు చేసింది. అల్ట్రాటెక్ సిమెంట్‌‌‌‌ కెపాసిటీ   ఈ ఏడాది  మార్చి నాటికి 188.8 మిలియన్ టన్స్ పర్‌‌‌‌‌‌‌‌ యానమ్‌‌‌‌ (ఎంటీపీఏ)గా ఉంది. 2024–25 లో రూ.75,955 కోట్ల ఆదాయం, 135.83 మిలియన్ టన్నుల అమ్మకాలు  సాధించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి కెపాసిటీని 200 ఎంటీపీఏకి పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.