అమ్మపల్లి ఆలయంలో బతుకమ్మ సంబురాలు

అమ్మపల్లి ఆలయంలో బతుకమ్మ సంబురాలు

శంషాబాద్, వెలుగు: నర్కుడలోని అమ్మపల్లి దేవస్థానంలో శంషాబాద్ జడ్పీటీసీ నీరటి తన్విరాజు ఆధ్వర్యంలో శనివారం రాత్రి బతుకమ్మ వేడుకలు సంబురంగా జరిగాయి. మహిళలు భారీ ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, మల్కారం సొసైటీ చైర్మన్ సతీశ్,ఎంపీపీ జయమ్మ, మండలంలోని గ్రామాలకు చెందిన మహిళా ఎంపీటీసీలు, సర్పంచ్​లు, ఆలయ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.