ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ

ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ

ఆసిఫాబాద్/కాగజ్​నగర్/బజార్​హత్నూర్, వెలుగు: బతుకమ్మ పండుగ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. ఆసిఫాబాద్ ​జిల్లా కెరమెరి మండలం మోడిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఇందిరా ఫెలోషిప్ ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుగుణ చీఫ్ ​గెస్ట్​గా హాజరయ్యారు. మహిళలతో కలిసి బతుకమ్మను తీరొక్క పూలతో అలంకరించి ఆడిపాడారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, మాజీ జడ్పీటీసీ లక్ష్మణ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మునీర్ అహ్మద్, కెరమెరి మండల ప్రెసిడెంట్ ఆత్రం కుసుంరావు తదితరులు  పాల్గొన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా చీఫ్​గెస్ట్​గా హాజరై స్టూడెంట్లు, టీచర్లతో కలిసి బతుకమ్మ ఆడారు. బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనూ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.