
బతుకమ్మ..తెలంగాణ పండగ. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ. అయితేఇన్నాళ్లు తెలంగాణ సినిమాల్లో..తెలుగు సినిమాల్లోనే కనిపించిన బతుకమ్మ..బాలీవుడ్కు వెళ్లింది. అక్కడ హిందీ ప్రేక్షకులను అలరించబోతుంది.
తెలంగాణ బతుకమ్మ పండుగకు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు దక్కింది. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలోకి కొన్ని జిల్లాలకే పరిమితమైన ఈ పూల పండగ...తెలంగాణ వచ్చాక..తెలుగు రాష్ట్రాలకే కాదు..దేశ వ్యాప్తంగా ప్రసిద్దిగాంచింది. ఇన్నాళ్లు బతుకమ్మ క్రేజ్ టాలీవుడ్లోని సినిమాల్లోనే కపించేది. మొట్టమొటి సారిగా బతుకమ్మ బాలీవుడ్ సినిమాలో కనిపించనుంది.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా..,వెంకటేశ్, భూమిక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో తెలంగాణ సంప్రదాయానికి పెద్దపీట వేశారు. ఇందులో మన బతుకమ్మ పాటను చేర్చారు. వెంకటేష్కు చెల్లెగా పూజాహెగ్డె నటిస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్ల కుటుంబం తెలంగాణ ప్రాంతానికి చెందినది కావడంతో..కిసీ కా భాయ్..కిసీ కా జాన్ సినిమాలో బతుకమ్మ పాటను పెట్టినట్టు సమాచారం. ఈ సినిమా ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా విడుదలవుతుంది.
'కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీ నుంచి విడుదలైన బతుకమ్మ పాట దేశ ప్రజలతో పాటు..తెలంగాణ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టేలా బతుకమ్మ సాంగ్‌ను చిత్రీకరించారు. ముంగిట్లో ముగ్గేసి గొబ్బిల్లే పెడదామా...గడపకు బొట్టేట్టి తోరణాలు కట్టేద్దామా.. అంటూ హిందీ చిత్రంలో తెలుగు పాట రావడంతో తెలంగాణ అభిమానులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.