ఇండియా గేట్ వద్ద బతుకమ్మ సంబరాలు

ఇండియా గేట్ వద్ద బతుకమ్మ సంబరాలు

న్యూఢిల్లీ: తెలంగాణ వియోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. దేశ రాజధానిలోని ఇండియా గేట్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలో ఉంటున్న తెలుగు ప్రజలు బతుకమ్మ సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పడుతూ అందరిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.