బాసర ట్రిపుల్ ఐటీలో బతుకమ్మ సంబరాలు

బాసర ట్రిపుల్ ఐటీలో బతుకమ్మ సంబరాలు

బాసర, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలో సోమవారం టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు, విద్యార్థులు బాసర కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. వీసీ గోవర్ధన్, కమిటీ కన్వీనర్ రాములు, అసోసియేట్ డీన్ ఆఫ్ ఇంజినీరింగ్, అసోషియేట్ డీన్ ఆఫ్  సైన్స్&హుమానిటీస్, కల్చరల్ కమిటీ డ్యాన్స్ క్లబ్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ పవన్ కుమార్, సభ్యులు హాజరయ్యారు. వీసీ మాట్లాడుతూ.. బతుకమ్మను ఎంత అందంగా పేరుస్తామో.. విద్యార్థులు తమ జీవితాలను కూడా అంత అందంగా మలుచుకోవాలని సూచించారు.  బతుకమ్మలు పేర్చిన మహిళా లెక్చరర్లు, విద్యార్థినులకు బహుమతి ప్రదానం చేశారు.