నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదు

నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదు

బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ సాధ్యం కాదని.. అక్కడి పరిస్థితులు అందుకు తగ్గట్లు లేవని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామన్న టీఆర్ఎస్.. ఇప్పటివరకు ఎందుకు ఓపెన్ చెయ్యలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని.. దానికి కావాల్సిన భూమిని ప్రభుత్వం ఇచ్చిందని.. వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. హైదరాబాద్ సైన్స్ సిటీతో పాటు వరంగల్లో సైనిక్ స్కూల్ కు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదని ఆరోపించారు. 

సిరిసిల్లకి, గజ్వేల్ కి మాత్రమే ఎందుకు రైల్వే ప్రాజెక్టులు వెళుతున్నాయని.. దుబ్బాకకు ఎందుకు నిధులు కేటాయించడంలేదని కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న ఆయన.. చెర్లపల్లిలో రైల్వే మూడో టెర్మినల్ కోసం ల్యాండ్ ఇవ్వటం లేదన్నారు. రెండు రాష్ట్రాలు కూర్చొని విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఢిల్లీలోనీ తెలంగాణా భవన్, ఏపీ భవన్ విభజనకు రెండు రాష్ట్రాలు సిద్ధంగా లేవన్నారు. 

మజ్లీస్ డిమాండ్ మేరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ నిర్వహించలేదని కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం ఢిల్లీలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్తవ్యపథ్లో జరిగే ఈ వేడుకలకు కేంద్రమంత్రులు సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లు చెప్పారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమన్నారు.