ఐక్య ఉద్యమాలతోనే అధికారం : బీసీ కుల సంఘ నాయకులు

ఐక్య ఉద్యమాలతోనే అధికారం : బీసీ కుల సంఘ నాయకులు

సిద్దిపేట టౌన్, వెలుగు: ఐక్య ఉద్యమాల ద్వారానే అధికారాన్ని సాధిస్తామని బీసీ కులసంఘ నాయకులు పిలుపునిచ్చారు.  ఆదివారం  పట్టణంలోని విపంచి కళానిలయంలో లక్కరసు ప్రభాకర్ వర్మ అధ్యక్షతన బీసీ కుల సంఘాల ఐక్య వేదిక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి నేటికీ 150 ఏళ్లు అయిందని ఈ రోజు ఈ సదస్సును ఏర్పాటుచేయడం ఆనందంగా ఉందన్నారు. 

ఓబీసీ రిజర్వేషన్ల సాధన సమితి సమన్వయకర్త కోఆర్డినేటర్ శ్రీహరి యాదవ్ మాట్లాడుతూ.. ఉమ్మడిగా ఐక్య ఉద్యమాల్ని చేయడం ద్వారా మాత్రమే హక్కుల్ని సాధించుకోగలుగుతామన్నారు.  తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు  రాజ్యలక్ష్మి మాట్లాడుతూ  చట్టసభలో జనాభా నిష్పత్తి ప్రకారం మన వాటా సాధించుకోవాలన్నారు. 

సమావేశంలో  సద్గుణ, పంజాల కవిత,  పయ్యావుల పూర్ణిమ, దాసరి భాగ్య, పాతుకుల లీలాదేవి,  ఆలకుంట మహేందర్ , మామిళ్ల ఐలయ్య,  కోరే ఎల్లయ్య,  తుమ్మల శ్రీనివాసు, బొంపల్లి  శ్రీహరి, దరిపల్లి  శ్రీనివాసు, నాయక మల్లయ్య, అగుళ్ల శంకర్, బూర మల్లేశం, గడ్డం వెంకటయ్య, కోత్వాల్ నరేందర్,  ఆకుల ప్రశాంత్, బోయ రాములు పాల్గొన్నారు.