
- కేంద్రానికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ లేఖ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర బీసీ జాబితాలో 112 కులాలు ఉండగా.. 2016లో కేంద్రం విడుదల చేసిన ఓబీసీ జాబితాలో కేవలం 90 కులాలు మాత్రమే ఉన్నాయని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. తర్వాత బీసీ జాబితాలో 17 కులాలను రాష్ర్ట ప్రభుత్వం చేర్చిందని, దీంతో మొత్తం బీసీ కులాల సంఖ్య 130కి చేరిందన్నారు. అయినా కేంద్ర ఓబీసీ జాబితాలో 40 కులాలను ఇంకా చేర్చలేదన్నారు.
గురువారం కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రి వీరేంద్ర కుమార్‌కు నిరంజన్ లేఖ రాశారు. ఈ 40 కులాలను కేంద్రం జాబితాలో చేర్చాలని 2016 నుంచి కేంద్రాన్ని రాష్ట్రం కోరుతోందని గుర్తు చేశారు. 2021 డిసెంబర్‌లో,2023 సెప్టెంబర్‌లో జాతీయ బీసీ కమిషన్ విచారణలు జరిగినప్పటికీ, కేంద్రం మాత్రం నిర్ణయం ప్రకటించలేదని లేఖలో పేర్కొన్నారు.