ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌‌కు బీసీ గురుకుల స్టూడెంట్స్.. 20 మందిని ఎంపిక.. మంత్రి పొన్నం సన్మానం

ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌‌కు బీసీ గురుకుల స్టూడెంట్స్.. 20 మందిని ఎంపిక.. మంత్రి పొన్నం సన్మానం

హైదరాబాద్, వెలుగు: మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌‌లోని అడ్వెంచర్ క్యాంప్‌‌నకు రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల చెందిన 20 మంది స్టూడెంట్స్ ఎంపికయ్యారు. ఈ నెల 25 నుంచి జూన్ 10 వరకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద వీరు ట్రెక్కింగ్ చేయనున్నారు. ఎంపికైన 20 మందిని శనివారం సెక్రట్రేయెట్‌‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ మెడల్స్‌‌తో సత్కారించి, అభినందించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలకు, తల్లిదండ్రులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రికార్డు క్రియేట్ చేయాలని తెలిపారు. కలలు కనడం తప్పు కాదని, కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల సెక్రటరీ సైదులు , జాయింట్ సెక్రటరీ తిరుపతి, మాలవత్ పూర్ణ, రాకేశ్‌‌ పాల్గొన్నారు.