బీసీ రిజర్వేషన్ లు కల్పించకుంటే..  కాంగ్రెస్ కు ఇవే చివరి ఎన్నికలు : ఆర్.కృష్ణయ్య

 బీసీ రిజర్వేషన్ లు కల్పించకుంటే..  కాంగ్రెస్ కు ఇవే చివరి ఎన్నికలు :   ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలవుతాయని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసి తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి మనసు, మానవత్వం లేదని, బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుందని విమర్శించారు.