- సీఎం రేవంత్‌కు జాజుల ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసినప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన రిజర్వేషన్బిల్లులను కేంద్రంలో ఎందుకు పెండింగ్పెట్టారో, ఎప్పుడు క్లియర్ చేస్తారో ప్రధానిని ఎందుకు అడగలేదని నిలదీశారు. ఈ మేరకు బుధవారం జాజుల పత్రిక ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నందున బీసీ రిజర్వేషన్లపై ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని శ్రీనివాస్గౌడ్గుర్తు చేశారు. రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో కూడా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం పార్లమెంటులో పోరాటం చేసేలా రాహుల్ గాంధీని ఒప్పిస్తే బాగుండేదన్నారు.
