15 ఏండ్లకే PHD పూర్తి..క్వాంటం ఫిజిక్స్ లో డాక్టరేట్ అందుకున్న జర్మనీ బాలుడు

15 ఏండ్లకే PHD పూర్తి..క్వాంటం ఫిజిక్స్ లో డాక్టరేట్ అందుకున్న జర్మనీ బాలుడు

బ్రస్సెల్స్​: పదిహేనేండ్ల వయసులోనే పీహెచ్​డీ పూర్తి చేశాడో బాలుడు. క్వాంటం ఫిజిక్స్​పై థీసిస్​ సమర్పించి... డాక్టరేట్ అందుకున్నా డు. బెల్జియం దేశానికి చెందిన లారెంట్​ సైమన్స్  తన 12 ఏండ్ల వయసులోనే ఫిజిక్స్​లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ డిగ్రీకి మూడేండ్ల కాలపరిమితి ఉండగా.. దాన్ని 18 నెలల్లోనే కంప్లీట్​ చేశాడు. దీంతో ఆ బాలుడి ప్రతిభను గుర్తించి.. ‘లిటిల్​ ఐన్​స్టీన్​’గా అందరూ పిలవడం మొదలుపెట్టారు. 

అమెరికా, యూకే సహా పలు దేశాల యూనివర్సిటీలు తమ దగ్గర చదువుకోవాలని ఆఫర్లు ఇచ్చాయి. అయితే.. ఆంట్వెర్ప్​ యూనివర్సిటీలో పీహెచ్​డీ సీటు సాధించి, పరిశోధన కోసం క్వాంటం ఫిజిక్స్​ను సైమన్స్​ ఎంచుకున్నాడు. గత నెల థీసిస్​ను సమర్పించి.. తాజాగా డాక్టరేట్​ పట్టాను అందుకున్నాడు. సైమన్స్​ ఐక్యూ లెవల్​  145 వరకు ఉంది.