- ఆతిథ్యం ఇవ్వనున్న చేవెళ్ల మోడల్ స్కూల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు తమలోని సృజనాత్మకతను చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 6న రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల మోడల్ స్కూల్ లో రాష్ట్ర స్థాయి సైన్స్ జాతర జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆ జిల్లా డీఈఓకు మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి ఆదేశాలు జారీచేశారు. ‘వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ కోసం స్టెమ్’ అనే ప్రధాన థీమ్ తో ఈ ప్రదర్శనలు ఉండబోతున్నాయని ఆయన వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్ల నుంచి విద్యార్థులు అటెండ్ కానున్నారు. ఒక్కో స్కూల్ నుంచి ఇద్దరు స్టూడెంట్లు, వారికి గైడ్ గా ఇద్దరు టీచర్లు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. మొత్తం 388 ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు. వ్యవసాయం, ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయాలు, గ్రీన్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీ వంటి వాటిపై విద్యార్థులు ప్రయోగాలను వివరించనున్నారు.
