అన్నగారు వస్తారు మూవీ నుంచి సాంగ్ రిలీజ్

అన్నగారు వస్తారు మూవీ నుంచి సాంగ్ రిలీజ్

కార్తి హీరోగా నలన్ కుమారస్వామి తెరకెక్కించిన తమిళ చిత్రం ‘వా వాతియార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో విడుదల చేయబోతున్నారు. కృతిశెట్టి హీరోయిన్. కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈనెల 12న విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు. అలాగే ‘అన్నగారు’ అంటూ సాగే టైటిల్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ను  కూడా విడుదల చేశారు.  

సంతోష్ నారాయణన్ కంపోజ్ చేయగా.. ఎస్.పి.అభిషేక్, హరిప్రియ ఎనర్జిటిక్ గా పాడారు. ‘‘అన్నగారు, అన్నగారు.. ఆల్రెడీ నే రిచ్ కిడ్డు.., పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశా, రాజమౌళికి ఫోన్ చేసి నా మీద బయోపిక్ ఒకటి తీయమంటున్నా..” అంటూ రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ రాశారు. యాక్షన్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా వస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.