మాంద్యం పేరుతో బీసీల గొంతు కోస్తున్నరు

మాంద్యం పేరుతో బీసీల గొంతు కోస్తున్నరు
  • బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌‌‌‌‌‌‌‌.కృష్ణయ్య
  • బడ్జెట్‌‌‌‌‌‌‌‌ తగ్గింపుపై 14 సంఘాల సమావేశం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆర్థిక మాంద్యం పేరుతో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ బీసీల గొంతు కోస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌‌‌‌‌‌‌‌. కృష్ణయ్య మండిపడ్డారు. బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో బీసీలకు తక్కువ కేటాయింపులపై హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బీసీ భవన్‌‌‌‌‌‌‌‌లో మంగళవారం 14 బీసీ సంఘాలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో బీసీలకు రూ. 5 వేల కోట్లు కేటాయించి ఇప్పుడు రూ. 2900 కోట్లకు తగ్గించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ప్రభావమే లేదని అన్నారు. జీఎస్టీ వాటా 20 శాతం, ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌లో 30 శాతం, రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్లలో 60 శాతం ఆదాయం పెరిగిందని వివరించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. గతేడాది ఫీజు బకాయిలు రూ. 1600 కోట్లు, హాస్టళ్ల బకాయిలు రూ.180 కోట్లు, బీసీ కార్పొరేషన్, 12 బీసీ  కులాల ఫెడరేషన్ సబ్సిడీ రుణాల బకాయిలు రూ. 6 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. దీనిపై బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు.

బీసీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌కు బడ్జెట్ నామమాత్రంగా రూ. 5 కోట్లు భిక్షమేసినట్లు కేటాయించారని కృష్ణయ్య మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌కు గతేడాది 5.77 లక్షల దరఖాస్తులు వచ్చాయని, సబ్సిడీ రుణాలు ఇంతవరకు మంజూరు చేయలేదన్నారు. బీసీ సబ్ ప్లాన్ ప్రస్తావనే లేదని మండిపడ్డారు. మంత్రివర్గ నిర్మాణంలో కూడా బీసీలకు అన్యాయం చేశారని, పంచాయతీ రాజ్ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి మోసం చేశారన్నారు. వెంటనే పునఃపరిశీలించి, జనాభా ప్రకారం 10 వేల కోట్లకు బడ్జెట్ పెంచాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.  లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపడతామన్నారు. సమావేశంలో నాయకులు గుజ్జ కృష్ణ, సత్యనారాయణ, నీలం వెంకటేష్‌‌‌‌‌‌‌‌, నర్సింహ గౌడ్‌‌‌‌‌‌‌‌, జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు.

నిధులివ్వకుండా బతుకులెట్ల మారుస్తరు?

సంక్షేమ, సాగునీటి రంగాలు తనకు రెండు కండ్లని చెప్పిన సీఎం కేసీఆర్‌‌‌‌.. సంక్షేమ రంగాన్ని పూర్తిగా విస్మరించారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌ విమర్శించారు. గత ఆర్థిక బడ్జెట్‌‌‌‌లో బీసీలకు 5960 కోట్లు కేటాయిస్తే, ఈసారి 2672 కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. సంక్షేమ రంగానికి ఇట్లా నిధులు తగ్గిస్తూ బంగారు తెలంగాణలో బీసీల బతుకులు ఎలా బాగుచేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.

మంగళవారం హైదరాబాద్‌‌‌‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో గవర్నర్ల ఆత్మీయ, అభినందన, సన్నాహక సమావేశం జరిగింది. బడ్జెట్‌‌‌‌లో బీసీ సబ్‌‌‌‌ప్లాన్‌‌‌‌ ఊసేలేదని శ్రీనివాస్​ గౌడ్​ ఆగ్రహం వ్యక్తంచేశారు. పారిశ్రామిక పాలసీ, కల్యాణ లక్ష్మి, ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రస్తావనే లేదని,12 ఫెడరేషన్లకు, కార్పొరేషన్లకు చిల్లి గవ్వ కూడా కేటాయించలేదని ఆరోపించారు. అప్పులేమో బీసీలకు, ఆస్తులేమో అగ్రవర్ణాలకా అని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం పాటిస్తోందన్నారు. జాతీయ బీసీ కమిషన్‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ వంగాల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బీసీల్లో ఐకమత్యం పెరగడం వల్లే మంత్రులకు ఉద్వాసన పలికేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

BC Leader R.krishnaiah fires on CM KCR