బర్రెలు, గొర్రెలు ఇచ్చి బిచ్చగాళ్లను చేసిండ్రు

బర్రెలు, గొర్రెలు ఇచ్చి బిచ్చగాళ్లను చేసిండ్రు
  •  బీసీ బిల్లుపై 30ఏళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోలే
  •  జంతర్ మంతర్ వద్ద  ఆర్.కృష్ణయ్య ధర్నా

హైదరాబాద్, వెలుగు: చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ 30 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉందని, ఏ పార్టీ పట్టించుకోవట్లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా బర్రెలు, గొర్రెలు ఇచ్చి బిచ్చగాళ్లను చేశారని మండిపడ్డారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల బిల్లును మాత్రం ఒక్క రోజులో ఆమోదింపచేశారని గుర్తు చేశారు. గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 16 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ ఎంపీ ప్రస్తుత సభ లో లేరని, జనాభాకు తగ్గట్టు పరిపాలన, ఉద్యోగాలలో ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.