కోల్‌బెల్ట్/ఆసిఫాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బీసీ సమాజ్ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్‌చేశారు. బీసీ సమాజ్ఆధ్వర్యంలో మందమర్రి సింగరేణి హైస్కూల్గ్రౌండ్లో గురువారం చాయ్‌పే చర్చ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ సవరణ బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలన్నారు. ఎలాంటి ఉద్యమం లేకపోయినా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన కేంద్రం.. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని 40 ఏళ్లుగా ఉద్యమిస్తున్నా పట్టించుకోవడంలేదన్నారు.
కార్యక్రమంలో వివిధ రాజకీయ, కార్మిక సంఘాలు, కులసంఘాల లీడర్లు ఎండీ అబ్బాస్, సలెంద్ర సత్యనారాయణ, బర్ల సదానందం, సుదర్శన్ ,సాగర్, రాజేందర్, జనార్ధన్, నస్పూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ ఆసిఫాబాద్ జిల్లా చైర్మన్ రూపునర్ రమేశ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలకు వెళ్తామని చెప్పడం సరికాదన్నారు. బీసీ బిల్లు గురించి బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించాలని, లేకపోతే బీజేపీ ఎంపీలను రాష్ట్రంలో తిరగనీయకుండా చేస్తామని హెచ్చరించారు.
బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్, రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకులు కోట వెంకన్న, బీసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మారుతి పటేల్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లవ్ కుమార్, బీసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ మాచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
