తెలంగాణ ఉద్యమంలో పొన్నంది కీలక పాత్ర : బీసీ నేతలు

తెలంగాణ ఉద్యమంలో పొన్నంది కీలక పాత్ర : బీసీ నేతలు
  • మంత్రికి  బర్త్​డే విషెస్​ చెప్పిన బీసీ నేతలు

ముషీరాబాద్, వెలుగు: ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ​ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగొని బాలరాజ్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం సిటీలోని ఆఫీసులో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రిని కలిసిన వారిలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్​చారి, దుర్గయ్య గౌడ్, సింగం నాగేశ్​గౌడ్, విక్రమ్ గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ గౌడ్, శేఖర్, వేముల వెంకటేశ్, మహిళా నాయకులు మణి మంజరి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఓయూలోని ఆర్ట్స్​కాలేజీ వద్ద తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్- అధ్యక్షుడు పొన్నం ముత్యం గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

హుస్నాబాద్​ ప్రజలతో పొన్నం 

హైదరాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్​డే వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్, ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలతోనే పొన్నం గడిపారు. ప్రజల మధ్య బర్త్ డే కేక్ కట్ చేశారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్ గౌడ్‌‌‌‌‌‌‌‌తో పాటు మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కాంగ్రెస్ నేతలు పొన్నంకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు కేక్ కట్ చేసి మంత్రి పుట్టిన రోజును జరుపుకున్నారు. కరీంనగర్, సిద్దిపేట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి పొన్నంకు బర్త్ డే విషేస్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి పొన్నం కృతజ్ఞతలు తెలిపారు.