ఢిల్లీ జంతర్ మంతర్ బీసీ గర్జన హైలెట్స్ : తెలంగాణ గళంతో దద్దరిల్లిన ఢిల్లీ

ఢిల్లీ జంతర్ మంతర్ బీసీ గర్జన హైలెట్స్ : తెలంగాణ గళంతో దద్దరిల్లిన ఢిల్లీ

బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ధ నిర్వహిస్తున్న మహాధర్నాకు బీసీలు పోటెత్తారు.సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాకు  తెలంగాణ పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీలు, మంత్రులు, నాయకులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్ధతు ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్య నేతలు మాట్లాడారు. 

మహాధర్నా హైలెట్స్:

 

రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకపోతే మోదీని గద్దె దించుతాం.. రాహుల్ను ప్రధాని చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి 

 

  • రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వాలని రెండు బిల్లులను ఆమోదించాం
  • ఆనాటి సీఎం కేసీఆర్ బీసీలపై కక్ష్య గట్టి తెలంగాణలో 50 శాతం మించకుండా చట్టం చేశారు 
  • బలహీన వర్గాలకు అన్యాయం చేసే చట్టాన్ని తొలగించేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చాం
  • విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును చట్టం చేసి గవర్నర్ రాష్ట్రపతికి పంపించారు
  • 50 శాతం క్యాప్ ను తొలగించచే ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి దగ్గరకు వచ్చింది
  • నాలుగు నెలలు గడిచినా ఆమోదం లేదు.. 
  • బీసీలకు అన్యాయం చేస్తుంటే గల్లీ నుంచి ఢిల్లీకి వచ్చి ధర్నా చేపట్టాం
  • హైదరాబాద్ లో, తెలంగాణలో చేస్తే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పార్టీల మద్ధతు మాత్రమే ఉంటుంది
  • ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేస్తే దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీల మద్ధతు ఇస్తున్నారు
  • అదే విధంగా ఇండియా కూటమి పార్టీలు, నేతలు కూడా మద్ధతు ఇస్తున్నారు
  • తెలంగాణ కోసం పార్లమెంటులో మోదీ సర్కార్ తో కొట్లాడుతామని ధర్నాకు వచ్చి అండగా నిలిచారు
  • రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో యాత్ర చేసి దేశానికి హామీ ఇచ్చారు
  • కులగణన చేస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు
  • కామారెడ్డిలో 42 శాతం బీసీ డిక్లరేషన్ ఇచ్చాం
  • రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య కామారెడ్డిలో హామీ ఇచ్చారు
  • ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 17 మంది సీఎం లు.. దేశంలో 300 కు పైగా ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని సాహసం మేము చేశాం
  • కేబినెట్ మంత్రులు నాకు అండగా నిలిచి 300 సీఎంలు చేయలేని పనిని చేసే అవకాశం నాకు కల్పించారు
  • దేశానికే ఆదర్శంగా నిలబడటానికి తెలంగాణ సీఎంగా నాకు అవకాశం వచ్చింది
  • రాహుల్ గాంధీ సందేశాన్ని అందిపుచ్చుకుని.. జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించాం
  • తెలంగాణలో రిజర్వేషన్లకు అడ్డుపడే కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాం చందర్ రావు కాదు పోటీ.. 
  • మన పోటీ ప్రధాని నరేంద్ర మోదీ.. 
  • బీసీ రిజర్వేషన్లకు మద్ధతు ఇచ్చి న్యాయం చేస్తారా లేదా అని సవాల్ విసురుతున్నాం
  • రాహుల్ గాంధీని ప్రధాని చేసి 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని మోదీకి చెప్తున్నాం
  • తెలంగాణ లో రిజర్వేషన్లు ఇస్తామంటే.. గుజరాత్ వాళ్లకు వచ్చిన కడుపునొప్పేంటి
  • బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మేం బిల్లులు చేస్తే..
  • మా బిల్లును తుంగలో తొక్కే హక్కు మీకు ఎక్కడుంది
  • మోదీకి ఆలోచన లేదు సరే.. ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాం చందర్ రావులకు ఏమైందని ప్రశ్నిస్తున్నాను
  • బీజేపీ వాళ్లు మోదీ మోచేతి నీళ్లు తాగొచ్చు
  • మరి బీఆర్ఎస్ కు ఏమైంది.. మీరు కూడా మోదీ మోచేతి నీళ్లు తాగుతారా..?
  • డ్రామా మీ కుటుంబంలో ఉంది.. మాకు చిత్తశుద్ధి ఉంది
  • ఫిబ్రవరి 4 నుంచి 365 రోజుల్లో వందేళ్ల బీసీల సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నాం
  • వంద మీటర్ల గోతి తొవ్వి పాతిపెట్టినా మీకు బుద్ధి రాలేదు
  • మీ ఇంట్లనే సక్కగ లేదు. ఒకరు బీసీలకు మద్ధతు అంటారు.. ఇంకొకాయన మాట్లాడరు.. మరొకరు మధ్యరకం అంటారు.. అటు ఇటు గాని వాళ్లు నా గురించి మాట్లాతారా..
  • మోదీకి సెప్టెంబర్ నాటికి 75 ఏండ్లు పూర్తవుతున్నాయి..
  • 2002 లో ఆయనను కుర్చీ నుంచి దించాలని వాజ్ పేయి ప్రయత్నించారు
  • ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషీని 75 ఏండ్లు నిండాయని తొలగించారు
    మోదీని కూడా దింపాలనుకుంటే ఆయన పరమభక్తులు కాదంటున్నారు..
  • ఆయనను కుర్చీ దింపాలని ఆరెస్సెస్ అనుకుంటే.. ఆయన శిష్యుడు శశికాంత్ దూబే.. మోదీనే 2029 వరకు పీఎం గా ఉంటారని అంటున్నారు
  • మోదీ 2029 వరకు మీరే పీఎం గా ఉండాలి
  • వాజ్ పేయి, ఆరెస్సెస్ చేయలేని పని.. 2029 లో మోదీని రాహుల్ గాంధీ గద్దె దించకుంటే చూడండి
  • మోదీ పేరునే వచ్చే ఎన్నికల్లో పోటీకి రండి.. 150 సీట్లకు మించకుండా మిమ్మల్ని ఓడిస్తాం
  • 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే గద్దె దించుతాం
  • తెలంగాణ ప్రజల శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారు
  • ఆనాడు ఇందిరా గాంధీ రిజర్వేషన్లు, ఇదిరమ్మ ఇళ్లు, అసైంన్ మెంట్ భూములు, ఆదివాసీలకు పోడు భూములు, 25 లక్షల ఎకరాలు ఎస్సీలకు, 10 లక్షల ఎకరాలకు ఎస్టీలకు భూమి ఇచ్చింది.. 
  • ఇందిరమ్మ ఆదివాసీ, దళితులను సొంత బిడ్డల్లా చూసుకుంది కాబట్టే దేశాన్ని ఏలింది
  • ఆమె పుత్రుడు రాజీవ్ గాంధీ టెక్నాలజీని దేశంలో ప్రవేశపెట్టారు
  • ఆయన మిత్రుడు శ్యాం పిట్రోడా సహకారంతో ఇండియాలో టెక్నాలజీ విప్లవం వచ్చింది
  • ఆనాడు రాజీవ్ గాంధీ వేసిన పునాదులతో ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్స్ టెక్నాలజీలో ఏలుతున్నారు.. 
  • ఆనాడు బీసీలకు న్యాయం చేయలేకపోయామని రాహుల్ భావించారు..
  • అందుకే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని భావించారు
  • రాహుల్ గాంధీ సందేశాన్ని దేశం మొత్తానికి వినిపించేందుకే ఇక్కడ ధర్నా చేస్తున్నాం
  • మోదీ గారు ఇప్పటికైనా కుట్రలు, కుతంత్రాలు మానేయండి
  • స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించకుండా కేసీఆర్ చేసిన కుట్రలను కొట్టేందుకు ఆర్డినెన్స్ కూడా పంపించాం.. 
  • వాటిని అమలు చేస్తారా చేయరా..
  • అమలు చేయకుంటే ఢిల్లీకి రాం.. తెలంగాణ గల్లీలోనే చూసుకుంటాం
     

 

డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క: 

  • కులగణన అనేది దేశంలో ఎక్కడా జరగలేదు
  • కేవలం తెలంగాణలోనే జరిగింది
  • రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేశాం
  • నాయకుడు రాహుల్ ఇచ్చిన వాగ్ధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు కాగానే తీర్మానం చేసి కులగణనకు వెళ్లాం
  • ముఖ్యమంత్రిగా నాపై బాధ్యత ఉందని కేబినెట్ లో తీర్మానం చేయడం.. అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానం చేయడం జరిగింది
  • ఇది సాధ్యమా అని కొందరు హాస్యంగా మాట్లాడారు
  • దేశంలో అనేక మంది మహానాయకులు వచ్చారు.. ఎవరూ చేయలేకపోయారు.. ఈ ముఖ్యమంత్రి వలన అవుతుందా అని ప్రశ్నించారు..
  • మా నాయకుడు రాహుల్ ఇచ్చిన వాగ్ధానం.. అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు
  • అందులో భాగంగా సైంటిఫిక్ గా కులగణన సర్వే చేశాం
  • చిన్న పొరపాటు కూడా జరగకుండా ఒక్కొక్క బ్లాక్ గా ఏర్పాటు చేసి..
  • చిన్న తప్పు కూడా జరగకుండా సర్వే రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి ఇచ్చి తీర్మానం ఆమోదించాం
  • లెక్కలతో సహా విశ్లేషించి.. శాసనసభలో అందరికీ చర్చకు అవకాశం కల్పించాం
  • నిబద్ధతతో 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు జరిపిస్తామని చెప్పాం..
  • అదే నిబద్ధతతో చట్టం చేసి భారత ప్రభుత్వానికి పంపించాం
  • భారత ప్రభుత్వం కూడా చట్టం చేసి తెలంగాణకు పంపించాల్సిందే
  • ఇది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు మధ్య వివాదం కాదు
  • భారత రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది.. 
  • రాష్ట్రపతి, కేంద్రం ప్రభుత్వం చట్టాన్ని చేస్తారని నమ్ముతున్నాం
  • బీసీలకు అండగా ఉంటామని కేంద్రం కూడా ముందుకు వస్తుందని ఆశిస్తున్నాం.
  • మేం పంపించిన చట్టం గురించి ఆలోచన చేయండనీ చెప్పడానికే మేం ఇక్కడ ధర్నా చేస్తున్నాం
  • తెలంగాణ రాష్ట్ర సీఎం, కేబినెట్ దేశానికి ఒక దిశానిర్దేశం చేసింది.. 
  • అందులో భాగంగా అన్ని రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు మద్ధతు ఇచ్చారు
  • దీనికి మద్ధతుగా లోక్ సభ, రాజ్యసభలో అడ్జర్న్ మెంట్ మోషన్ ఇచ్చి చర్చిస్తున్నారు
  • రాష్ట్రం తరఫున ఎలాంటి పొరపాటు లేకుండా పకడ్బందీగా 100 శాతం పూర్తి చేసి ఢిల్లీకి పంపించాం
  • విజయవంతం కావాలని.. ఓబీసీల కల నెరవేరాలని అందరూ మద్ధతిస్తున్నారు
  • తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్, బీజేపీ మద్ధతు ఇచ్చింది
  • అదే మాదిరిగా పార్లమెంటులో కూడా బీజేపీ ఎంపీలు, కేంద్ర ప్రభుత్వం మద్ధతు ఇవ్వడమే కాకుండా బిల్లును చట్టం చేస్తుందని భావిస్తున్నాం
  • రేపటి దేశ భవిష్యత్తు.. రైజింగ్ తెలంగాణ ఒక దశ దిశగా నిలవాలని కోరుతున్నాం
     

బీసీల హక్కుల పోరాటం తెలంగాణ నుంచే మొదలైంది: : తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ  మీనాక్షి నటరాజన్

  • ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం బీసీ కోటా బిల్లును తెచ్చింది
  • కోటా సాధించేవరకు ఈ పోరాటం ఆగదు
  • కుల గణన చేసి 42 శాతం బిల్లును ఆమోదం చేశాం
  • ఇది రాహుల్ గాంధీ తెలంగాణ మోడల్
  • ఇది అందరి హృదయాలను కలిపే మోడల్
  • దేశంలో ఇతర మోడల్ ఉంది.. 
  • కులాలు, మతాల పేరున విభజించే మోడల్, ఓట్లు తొలగించి గెలవాలనే మోడల్.. బీహార్ లో ఓట్లను తొలగించి లబ్ది పొందాలనే మోడల్ ఇంకొకటి ఉంది.
  • బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ పనిచేస్తుంది
  • బీసీ బిల్లు తెచ్చి తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది
  • దేశ నిర్మాణంలో భాగమైన బీసీలకు వారి హక్కులు, వాటా అందాలి
  • సామాజిక న్యాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి బీసీ కోటా తెచ్చారు
  • టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ చారిత్రాత్మక మార్పులు తెచ్చారు 
  • నవనిర్మాణం చేయడమే కాంగ్రెస్ తెలంగాణ మోడల్
  • హక్కుల కోసం పోరాటం తెలంగాణ నుంచే మొదలైంది

బీసీ బిల్లుపై ప్రధాని మోదీ పరేషన్లో ఉన్నారు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

  • బీసీ కోటా బిల్లు తేవడం చారిత్రాత్మకం
  • తెలంగాణ బీజేపీ నేతలే కాదు.. ప్రధాని మోదీ పరేషాన్ లో ఉన్నారు
  • మద్ధతు ఇవ్వాలా, చట్టం చేయాలో 
  • 42 శాతం బీసీ కోటా తెచ్చిన రేవంత్ మొనగాడు
  • ఇన్నాళ్లు అడిగితే ఏ లెక్కన అడుతున్నారు అని ప్రశ్నించారు
  • అందుకోసం బీసీల లెక్క చేసి కులగణన చేశాం
  • కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చాం
  • తెలంగాణలో కులగణన చేసి అసెంబ్లీలో ఆమోదించాం
  • దేశంలోని బీసీలంతా తెలంగాణ వైపు.. రేవంత్ వైపు చూస్తున్నారు
  • రాహుల్ గాంధీ ఎక్కడ మాట్లాడినా.. తెలంగాణ వైపు చూడండి.. రేవంత్ వైపు చూడండి అని చెప్తున్నారు
  • నాలుగు మాసాలుగా కేంద్రం తొక్కిపెట్టింది
  • మోదీ గారికి మన బాధ, వ్యధ తెలియాలి
  • ఆ తర్వాత 50 శాతం సీలింగ్ తొలగించాలి
  • మోదీ తలచుకుంటే సాయంత్రానికే రిజర్వేషన్లు వస్తాయి
  • అమలు చేస్తే రాహుల్ కు పేరొస్తుంది..
  • రేవంత్ జాతీయ నేత అవుతారు అనేది వాళ్ల భయం
  • కిషన్ రెడ్డి ఎప్పుడైనా పని చేసి గెలిచారా..?
  • రాముడు, హనుమంతుడు పేరు చెప్పి గెలవాలని చూస్తారు
  • మేము కూడా పూజిస్తాం.. కానీ దేవుని పేరు అడగం
  • ముస్లింల పేరు చెప్పి రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూస్తున్నారు
  • సొల్లు కబుర్లు చెబుతారు
  • సికిందరాబాద్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీల మద్ధతు లేకుండా నామినేషన్ వేస్తారా
  • బీసీ బీసీ అని ఓట్లేయించుకున్న బండి సంజయ్.. కిషన్ రెడ్డి మాట వింటున్నావు.. 
  • బీసీలకు మద్ధతుగా రెడ్డీలు, బ్రాహ్మణులు, ఎస్సీలు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు
  • మోదీ గారు కళ్లు తెరుచుకోవాలి.. ధర్నా డెన్సిటీ ఏంటో తెలుసుకోవాలి
  • బీసీల రిజర్వేషన్ల విషయంలో రాహుల్ గాంధీ మాధిరిగానే.. రేవంత్ రెడ్డిగారు చరిత్రపుటల్లోకి వెళ్తారు
  • రిజర్వేషన్లు అమలు కావాలి.. స్థానిక ఎన్నికలు జరగాలి
  • మా అందరికీ కమిట్ మెంట్ ఉంది.. తపన ఉంది.. సాధించుకునే  వరకు ఎంత దూరమైన పోతాం
  • ఎన్నికలు ముఖ్యమే.. కానీ ఎన్నికలంటే రిజర్వేషన్లు అంతకన్నా ముఖ్యమని ఒక బీసీ నేతగా చెప్తున్నా
  • అందుకు మాకన్నా ఎక్కువ పట్టుదల మీకుంది
  • కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ.. రేవంత్ రెడ్డి సీఎం అయితే.. ఎస్సీ ఉపముఖ్యమంత్రి.. బీసీ పీసీసీ చీఫ్
  • పార్లమెంటులో ఒత్తిడి చేస్తాం.. మీరు ఢిల్లీలో ధర్నా చేయాలని ఖర్గే, సోనియా, రాహుల్ చెప్పారు.. అందుకే ఢిల్లీలో ధర్నా చేస్తాం
  • కేంద్ర ప్రభుత్వం దిగి వ స్తుంది.. 50 శాతం క్యాప్ తొలగిస్తుంది.. సాధిస్తాం. 
  • ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీల ఎంపీలు 

తెలంగాణ పోరాటానికి NCP అండగా ఉంటుంది : NCP ఎంపీ సుప్రియా సూలే

  • తెలంగాణ బీసీ కోటా పోరుకు మహారాష్ట్రీయులంతా అండగా ఉన్నారు.
  • తమిళనాడులో కరుణానిధి 69 శాతం రిజర్వేషన్లు సాధించారు
  • తమిళనాడులో రిజర్వేషన్ల సాధించిన కరుణానిధి పేరు సువర్ణాక్షరాలతో లిఖించారు
  • 42 శాతం రిజర్వేషన్లు తెచ్చిన సీఎం రేవంత్ పేరు కూడా నిలిచిపోతుంది

రిజర్వేషన్లు అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ కావాలి : మంత్రి శ్రీధర్ బాబు

  • అట్టడు వర్గాలు సమానత్వం వైపు రావాలంటే ఆర్థిక సమానత్వం తీసుకురావాలని..
  • రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు చట్టం తీసుకువచ్చాం
  • రిజర్వేషన్ల ప్రక్రియ అమలు కావాలంటే పార్లమెంటులో చట్టం చేయాలి
  • అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ కు పంపింతే కేంద్రం తాత్సారం చేస్తోంది
  • కేంద్ర ప్రభుత్వం రాజ్యాం సవరణ తీసుకురావాలి
  • తెలంగాణ మోడల్ ను దేశ వ్యాప్తంగా అమలు చేయాలి
  • బీసీల హక్కులకు సంబంధించిన విషయంలో బీజేపీ నాయకుల వైఖరి ఏమిటో చెప్పాలి
  • కేంద్రంపై ఒత్తిడి తెస్తారా లేదా
  • తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏండ్లు పాలించిన బీఆర్ఎస్..
  • బీసీల హక్కులను పట్టించుకోలేదు
  • కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు తెస్తే మొసలి కన్నీరు కారుస్తున్నారు
  • రేపు (ఆగస్టు 07) రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నాం
  • రాష్ట్రపతి సమయం ఇస్తారని ఆశిస్తు్న్నాం

బీసీ బిల్లును ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలి: మంత్రి దామోదర

  • మోదీ సర్కార్ బీసీల ఆవేదనను అర్థం చేసుకోవాలి
  • బీసీలకు 42 శాతం కోటా న్యాయమైన డిమాండు
  • బీసీ బిల్లులు అసెంబ్లీలో ఆమోదించినా అడ్డుకుంటున్నారు
  • కామారెడ్డి డిక్లరేషన్ వాగ్ధానానికి అనుగుణంగా.. రేవంత్ ప్రభుత్వం బీసీలకు సంబంధించి  కులగణన చేపట్టింది
  • తెలంగాణలో సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
  • ఫిబ్రవరి 4 సామాజిక న్యాయానికి సంబంధించిన దినం అని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు
  • బీసీలకు న్యాయం చేయాలంటే 42 శాతం రిజర్వేషన్లు అందించాలని నిర్ణయించాం
  • బిల్లులు పాస్ చేసి ప్రెసిడెంట్ పంపించాం
  • పార్టీలకు, కులాలకు అతీతంగా ధర్నా చేస్తున్నాం
  • వెనకబాటు తనాన్ని అంచనా వేసేందుకు ఎంపరికల్ డేటా కోసం కులగణన చేశాం 
  • 1994లో 60 శాతం రిజర్వేషన్లు తమిళనాడు ప్రభుత్వం సాధించింది.9వ షెడ్యూల్ లో పెట్టి బీసీ, ఎస్సీ, ఎష్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు
  • బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత రాష్ట్రపతిది.. ప్రధానిది.. కేంద్రానిది.. 
  • రిజర్వేషన్లు కొత్తకాదు.. సంఖ్య పెంచినం..