ముషీరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ సమాజానికి ప్రభుత్వం బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం చిక్కడపల్లిలోని పొలిటికల్ ఫ్రంట్ కార్యాలయంలో కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, యెలికట్టే విజయకుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్ తో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాల్ రాజ్ గౌడ్ మాట్లాడారు. పార్టీ పరంగా 42 రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.15వ పైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన 3 వేల కోట్ల నిధుల కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ఈ విధంగా చేయడం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. బీసీలకు ప్రతిఏడాది సబ్ ప్లాన్ నుంచి 20 వేల కోట్లు ఇస్తామని చెప్పారని రెండెండ్లలో రావాల్సిన 40 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
