రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి : ర్ దాసు సురేశ్

రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి : ర్ దాసు సురేశ్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విద్యుత్​షాక్​తో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని బీసీ రాజ్యాధికార సమితి ఫౌండర్​ దాసు సురేశ్​ డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆయన రామంతాపూర్​లో మృతుల కుటుంబాలను పరామర్శించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. విద్యుత్ బోర్డ్ ఇప్పటివరకు స్పందించకపోవడం విచారకరమన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోకపోతే విద్యుత్ సౌధాను ముట్టడిస్తామని హెచ్చరించారు. 

ఎమ్మెల్యే బండారి లక్ష్మణ్​తో ఫోన్​లో  మాట్లాడి బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామంతాపూర్ పద్మశాలీ సంఘం నాయకులు కొండ కృష్ణమూర్తి, సిరిశాల విజయ ప్రకాశ్, కొంగరి బాలచంద్రయ్య, రాపోలు భిక్షమయ్య, గోపి, రాపోలు శేఖర్ తదితరులుపాల్గొన్నారు.