ఫీజులు కట్టడి చేయట్లేదని డీఈవో ఆఫీస్‌‌కు తాళం

ఫీజులు కట్టడి చేయట్లేదని డీఈవో ఆఫీస్‌‌కు తాళం

యాదాద్రి, వెలుగు : అధికంగా ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్​ స్కూల్స్​పై చర్య తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం డీఈవో ఆఫీసుకు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లు డొనేషన్స్‌, బుక్స్‌ పేరిట ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు  చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొన్ని స్కూళ్లకు పర్మిషన్‌‌ కూడా లేదని, అయినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థి నేతలకు నచ్చజెప్పారు.

అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్స్​పై వారంలోగా చర్యలు తీసుకుంటానని డీఈవో నారాయణ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి ఆఫీసు తాళం తీశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం స్టేట్​ వైస్​ ప్రెసిడెంట్​పల్లగొర్ల మోదీ రాందేవ్, నేతలు తుమ్మటి మహేశ్, గుండెబోయిన శంకర్, నరాల భాను, భార్గవి, లక్ష్మీ ప్రసన్న, అర్చన, ప్రణీత, అనూష, మల్లీశ్వరి, వెన్నెల, పూజ, నందిని తదితరులు పాల్గొన్నారు.