
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
బషీర్బాగ్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్చారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపితే ఇంతవరకు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. వైఖరి మార్చుకోకుంటే బిహార్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కుల్కచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్, కనకాల శ్యాం, ఉప్పరి శేఖర్, గొడుగు మహేశ్, ఈడిగి శ్రీనివాస్, భాస్కర్, అనిల్, భాస్కర్, మధు పాల్గొన్నారు.