నల్గొండ అర్బన్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి చట్టబద్ధత కల్పించిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం నల్గొండలోని కలెక్టరేట్ ఎదుట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముట్టడించారు.
వివిధ డిమాండ్లతో కూడిన పత్రాన్ని కలెక్టరేట్ ఏవో మోతిలాల్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు విషయంలో సర్కారు అపసవ్య ధోరణిలో వెళ్తున్నదని మండిపడ్డారు.
బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుండు వెంకటేశ్వర్లు, సింగం లక్ష్మీనారాయణ, జేరిపోతుల రమేశ్ గౌడ్, అయితగోనీ జనార్దన్ గౌడ్, కట్ట హరిబాబు, బక్కతట్ల వెంకన్న యాదవ్ కట్టబోలు బీపేందర్ మచ్చ నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
