పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్లపై నోరెత్తరా? : జాజుల శ్రీనివాస్ గౌడ్

పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్లపై నోరెత్తరా? :  జాజుల శ్రీనివాస్ గౌడ్
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్

సోమాజిగూడ, వెలుగు: నెలరోజుల పాటు కొనసాగిన పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై కనీసం చర్చ జరగకపోవడం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్​లో తెలంగాణ దళిత సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు బత్తుల చంద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వరేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపినా పార్లమెంట్​లో చర్చించకపోవడం బీజేపీ నిర్లక్ష్యానికి  నిదర్శనమన్నారు. 

తెలంగాణ ఎంపీలు కూడా నోరెత్తకపోవడం విచారకరమన్నారు. అంతకుముందు దళిత సంఘాల జేఏసీ రూపొందించిన రిజర్వేషన్ల సాధన పోస్టర్​ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నవీన్ గౌడ్, భాస్కర్ చారి, వనం రమేష్, సునీల్, తుమ్మ శ్రీనివాస్, యాదగిరి, మేడిపల్లి జనార్ధన్, జైపాల్, భీమ్ రావు, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.