బ్లైండ్‌‌‌‌ క్రికెటర్లకు బీసీసీఐ చేయూత

బ్లైండ్‌‌‌‌ క్రికెటర్లకు బీసీసీఐ చేయూత

న్యూఢిల్లీ: అంధ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌‌‌‌న్యూస్ చెప్పింది. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా (సీఏబీఐ)కు అండగా నిలవాలని నిర్ణయించింది. ఇండియా మెన్‌, విమెన్ బ్లైండ్ క్రికెట్ టీమ్స్ కోసం ఏటా రెండు ఇంటర్నేషనల్ టూర్లకు  ప్రయాణ ఖర్చులు, స్వదేశంలో జరిగే సిరీస్‌‌‌‌ల కోసం వసతి సౌకర్యాలు కల్పించనుంది. 

అలాగే, బీసీసీఐ అనుబంధ స్టేడియాల్లో మ్యాచ్‌‌‌‌లు ఆడుకునేందుకు కూడా అనుమతినిస్తున్నట్టు శనివారం ప్రకటించింది. ‘అంధ క్రికెటర్ల విజయాలు ఇండియన్ క్రికెట్‌‌‌‌కు గర్వకారణం. ఈ మద్దతు ద్వారా బ్లైండ్ క్రికెటర్లకు మెరుగైన మౌలిక సదుపాయాలు, అవకాశాలు లభిస్తాయి’ అని బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్‌‌‌‌ పేర్కొన్నాడు.