ODI World Cup 2023: భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్.. బీసీసీఐకు నోటీసులు పంపిన కోల్‌కత్తా పోలీసులు

ODI World Cup 2023: భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్.. బీసీసీఐకు నోటీసులు పంపిన కోల్‌కత్తా పోలీసులు

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం(నవంబర్ 5) మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్‌ ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. రెండు జట్లు టాప్ ఫామ్ లో ఉండడం, కోహ్లీ పుట్టిన రోజు కావడం, ఈడెన్ గార్డెన్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమివ్వడంతో ఈ మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే టికెట్ల విషయంలో బ్లాక్ మార్కెట్ జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు సంచలంగా మారింది. 

ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీకి నోటీసులు జారీ చేశారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన టిక్కెట్ల విక్రయాలపై సమాచారం అందించాలని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. శనివారం సాయంత్రం నోటీసులు జారీ చేయగా.. బ్లాక్ మార్కెటింగ్ చేయడంపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్న మైదాన్ పోలీస్ స్టేషన్ అధికారికి పత్రాలను సమర్పించాలని బీసీసీఐ అధ్యక్షుడిని కోరినట్లు ఆయన తెలిపారు.

కోల్‌కతా పోలీసులు ఇప్పటి వరకు 19 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 108 టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌కు సంబంధించి ఏడు కేసులు నమోదు చేశారు.