ఐపీఎల్ 2026 మినీ వేలానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో జరగనున్న వేలానికి రంగం సిద్ధమైంది. 350 మంది ఆటగాళ్ల జాబితాను మంగళవారం (డిసెంబర్ 9) బీసీసీఐ ప్రకటించింది. వేలానికి ముందు దాదాపు అన్ని జట్లు తమ ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. దీంతో కొంతమంది స్టార్ ఆటగాళ్లు ఈ మినీ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. కామెరాన్ గ్రీన్, వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్, డేవిడ్ మిల్లర్, మహేష్ తీక్షణ వంటి స్టార్ ఆటగాళ్లు భారీ ధర పలకడం ఖాయంగా మారింది. స్టీవ్ స్మిత్, డికాక్ లాంటి వెటరన్ ప్లేయర్స్ పై ఆసక్తి నెలకొంది.
IPL 2026 వేలం ప్రారంభ సమయం:
ఐపీఎల్ 2026 వేలం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుందని బీసీసీఐ మంగళవారం (డిసెంబర్ 9) తెలిపింది. UAEలో సమయం ప్రకారం మధ్యాహ్నం 1:00 గంటలకు స్టార్ట్ కానుంది. మినీ వేలం కాబట్టి ఒకే రోజులో వేలం ముగియనుంది. మొదటి 70 మంది ఆటగాళ్లతో తొలి రౌండ్ వేలం ప్రారంభమవుతుంది. గత నెలలో జరిగిన మహిళల మినీ వేలం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు జరిగింది. 6-7 గంటల వ్యవధిలో ముగిసింది. అయితే మెన్స్ మినీ ఆక్షన్ 10 గంటల్లో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read:- ఐపీఎల్ 2026 మినీ వేలానికి 350 మంది క్రికెటర్లు..
లైవ్ స్ట్రీమింగ్, లైవ్ టెలికాస్టింగ్ వివరాలు:
లైవ్ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఈ ఈవెంట్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది
లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్ లో లైవ్ చూడొచ్చు
మొత్తం 350 మంది ఆటగాళ్లు డిసెంబర్ 16న జరగబోయే మినీ వేలానికి అందుబాటులో ఉంటారు. 350 మంది ఆటగాళ్లలో 240 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా.. మిగిలిన 110 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాలో 112 మంది క్యాప్డ్ ప్లేయర్లు ఉంటే.. 238 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు వేలానికి సిద్ధంగా ఉన్నారు. 238 మందిలో 224 మంది ఇండియన్స్ కాగా.. కేవలం 14 మంది అన్‌క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ మెగా ఆక్షన్ లో మొత్తం 77 స్లాట్‌లు అందుబాటులో ఉంటాయి. వాటిలో 31 విదేశీ ఆటగాళ్లకు ఉన్నాయి. మొత్తం 10 జట్ల వద్ద రూ. 237.55 కోట్లు ఉన్నాయి.
బేస్ ధర ఆటగాళ్ల వివరాలు:
రూ.2కోట్లు - 40
రూ.1.50 కోట్లు - 9
రూ.1.25కోట్లు - 4
రూ.1 కోటి - 17
రూ.75 లక్షలు - 42
రూ.50 లక్షలు - 4
రూ.40 లక్షలు - 7
రూ. 30 లక్షలు -227
మొత్తం: 350

