ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలంపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఎతిహాద్ అరీనాలో జరగనుంది. ఈ మినీ ఆక్షన్ లో పాల్గొనబోయే ఆటగాళ్లను మంగళవారం (డిసెంబర్ 9) ఇండియన్ ప్రీమియర్ లీగ్ షార్ట్‌లిస్ట్‌ను వెల్లడించింది. మొత్తం 350 మంది ఆటగాళ్లు డిసెంబర్ 16న జరగబోయే మినీ వేలానికి అందుబాటులో ఉంటారు. 350 మంది ఆటగాళ్లలో 240 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా.. మిగిలిన 110 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాలో 112 మంది క్యాప్డ్ ప్లేయర్లు ఉంటే.. 238 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు వేలానికి సిద్ధంగా ఉన్నారు. 238 మందిలో 224 మంది ఇండియన్స్ కాగా.. కేవలం 14 మంది అన్‌క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
ఈ మెగా ఆక్షన్ లో మొత్తం 77 స్లాట్‌లు అందుబాటులో ఉంటాయి. వాటిలో 31 విదేశీ ఆటగాళ్లకు ఉన్నాయి. మొత్తం 10 జట్ల వద్ద రూ. 237.55 కోట్లు ఉన్నాయి. ఏ సెట్స్ లో ఏ క్రికెటర్లు ఉన్నారో వివరాలను కూడా ఐపీఎల్ ప్రకటించింది. కామెరాన్ గ్రీన్, పృథ్వీ షా , డేవిడ్ మిల్లర్, సర్ఫరాజ్ ఖాన్ తొలి మార్క్యు సెట్ లో ఉన్నారు. 40 మంది ఆటగాళ్లు బేస్ ధర రూ.2 కోట్లకు తమ పేరును నమోదు చేసుకున్నారు. వీరిలో ఇద్దరు ఇండియన్ క్రికెటర్స్ ఉన్నారు. వేలం కోసం నమోదు చేసుకున్న 1,355 మంది ఆటగాళ్లలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ చివరిసారిగా షార్ట్‌లిస్ట్‌లో చేర్చబడ్డాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్న డికాక్.. అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతంగా రాణించాడు.
గ్రీన్, అయ్యర్, బిష్ణోయ్, లియామ్ లివింగ్‌స్టోన్, జార్జ్ లిండే, జాకబ్ డఫీ, అవుకిబ్ నబీ, జామీ స్మిత్, వానిందు హసరంగా, రాచిన్ రవీంద్ర, ప్రశాంత్ వీర్, టిమ్ సీఫెర్ట్, జోష్ ఇంగ్లిస్, జాసన్ హోల్డర్ , మైఖేల్ బ్రేస్‌వెల్, లాంటి ఆటగాళ్లపై ఫ్రాంచైజీల ఆసక్తిగా ఉన్నారు. ఈ వేలం మంగళవారం (డిసెంబర్ 16) భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు) ప్రారంభం కానుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధికంగా 64.30 కోట్ల రూపాయలతో ఆక్షన్ లో బరిలోకి దిగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ రూ.43.4 కోట్లతో తర్వాత స్థానంలో ఉంది.
🚨 TOTAL 350 PLAYERS IN IPL 2026 AUCTION 🚨 pic.twitter.com/rAsIIfYGJ2
— Tanuj (@ImTanujSingh) December 9, 2025

