జీతాల్లో కోతలు తప్పేలా లేవు

జీతాల్లో కోతలు తప్పేలా లేవు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బకు ఆదాయం పడిపోయి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ సహా పలు క్రికెట్ బోర్డు లు తమ ప్లేయర్లు, సిబ్బంది జీతాల్లో కోతలు పెట్టాయి. కొన్ని బోర్డులు ఉద్యోగులను కూడా తగ్గించుకున్నాయి. బీసీసీఐ మాత్రం ఇప్పటిదాకా అలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ అతి త్వరలో జీతాల్లో కోతలు, ఉద్యోగులపై వేటు వంటివి తమ బోర్డులోనూ తప్పవని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. ‘శాలరీ కట్ గురించి మా బోర్డు ఇప్పటిదాకా చర్చించలేదు. కానీ ఈ అంశంపై త్వరలో తప్పకుండా చర్చ ఉంటుంది. కోత వల్ల పడే ప్రభావం వంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఐపీఎల్ జరగనుండడంతో ఇప్పుడే ఓ నిర్ణయానికి రావాలి. ఎందుకుంటే ఐపీఎల్ సక్సెస్ పై చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి. పైగా గతంలో పోలిస్తే ఈసారి టైటిల్ స్పాన్సర్షిప్ విలువ చాలా తక్కువ’ అని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం