హైదరాబాద్‌‌‌‌లో బీసీజీ ఆఫీస్

హైదరాబాద్‌‌‌‌లో బీసీజీ ఆఫీస్

హైదరాబాద్​, వెలుగు: మేనేజ్‌‌‌‌మెంట్ కన్సల్టింగ్ కంపెనీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), హైదరాబాద్‌‌‌‌లో కొత్త ఆఫీసు ప్రారంభించింది. ఇదివరకే  దీనికి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో ఆఫీసులు ఉన్నాయి. ఈ వ్యూహాత్మక విస్తరణ ఈ ప్రాంతంలో పెరుగుతున్న వినియోగదారులకు మరింత మెరుగ్గా సేవ చేయడానికి సంస్థకు వీలు కల్పిస్తుందని బీసీజీ తెలిపింది. గత దశాబ్దంలో 20 శాతం సీఏజీఆర్​తో తాము భారతదేశంలో బలమైన వృద్ధిని సాధించామని బీసీజీ తెలిపింది.  

ఒక సంస్థ తమ వ్యాపారాన్ని ఎలా పెంచాలి, కొత్త మార్కెట్లలోకి ఎలా ప్రవేశించాలి లేదా పోటీని ఎలా ఎదుర్కోవాలి వంటి దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడానికి ఇది సహాయపడుతుంది. ఏ ఉత్పత్తులను నిలిపివేయాలి లేదా ఏ విభాగాలలో పెట్టుబడి పెట్టాలి అనే దానిపై సలహా (స్ట్రాటజిక్​ కన్సల్టింగ్​) ఇస్తుంది.